మేడా భవన్‌లో ఘనంగా జగన్ మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు
రాజంపేట : రాజంపేట బైపాస్‌లోని మేడా భవన్‌లో శనివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్సార్‌సీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు జెనుగు కృష్ణారావు యాదవ్(రాంనగర్ కృష్ణారావు) కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ఆశ్వీరదించాలన్నారు. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు. ఈయనతోపాటు పట్టణ కార్యదర్శి చెంగల్ శివ, ఉమ్మడి జిల్లా గౌడ సంఘం డైరెక్టర్ సుబ్రమణ్యంగౌడ్, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు జాహిద్‌అలీ, తాళ్లపాక సర్పంచ్ గౌరీశంకర్, బోయనపల్లె సర్పంచ్ బోగా రాజా, కౌన్సిలర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment