తవ్వుకో.. దోచుకో..
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ‘తవ్వుకో.. దోచుకో’ అన్న చందంగా కూటమి నాయకులు మట్టితో అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇందుకోసం డీకేటీ భూములను ఎంచుకున్నారు. యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతూ.. మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా తరలించేస్తున్నారు. ఎర్రగుంట్ల మండల పరిధిలోని మాలెపాడు ఫ్యాక్షన్ గ్రామంగా పోలీస్ రికార్డుల్లో ఉంది. ఈ గ్రామంలో ఇప్పటికీ పికెటింగ్ కొనసాగుతోంది. ఎలాంటి చిన్నపాటి సంఘటనలు కూడా జరగకుండా ఉండేందు పోలీసుల నిఘా ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత.. ఇక్కడ దందా సాగుతోంది. కూటమి నాయకులు దీన్ని ఆదాయ వనరుగా ఎంచుకున్నారు.
అనుమతులు లేకున్నా..
ఎలాంటి అనుమతులు లేకున్నా.. డీకేటీ భూముల్లో జేసీబీల ద్వారా మట్టిని తవ్వేస్తున్నారు. టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ప్రధాన పట్టణమైన ప్రొద్దుటూరుకు అధికంగా తీసుకున్నారు. ఒక్కొక్క టిప్పర్ మట్టిని రూ.3 వేలకు అమ్ముకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవున్నాయి. ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒక శాఖ అధికారులు మరో శాఖ వారిపై నెపం నెట్టివేస్తూ తప్పించుకుంటున్నారు. సమన్వయంతో పని చేసి కట్టిడి చేయాల్సి ఉండగా.. చోద్యం చూడటం గమనార్హం. దీంతో డీకేటీ భూముల్లో పెద్ద గుంతులు పడుతున్నాయి. భారీ వాహనాలు నిరంతరం వెళ్లడం ద్వారా రోడ్లు దెబ్బతింటున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మట్టి దందాను నియంత్రించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పేట్రేగుతున్న కూటమి నాయకుల
అక్రమాలు
డీకేటీ భూముల మట్టి తరలింపు
పట్టించుకోని అధికారులు
Comments
Please login to add a commentAdd a comment