గుర్రంకొండ : వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ రమణ అన్నారు. గురువారం గుర్రంకొండ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఫ్యూజ్‌ఆఫ్ కాల్‌సెంటర్, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ సరఫరా లైన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. విద్యుత్ ప్రమాదాలను నివారించాలన్నారు. కేబుళ్లలో విద్యుత్ ప్రవాహాన్ని పసిగట్టే ఇండక్షన్ టెస్టెర్‌ను సిబ్బంది దగ్గర ఉంచుకోవాలన్నారు. దీంతో విద్యుత్ ప్రవాహం తెలుసుకొని ప్రమాదాలు అరికట్టవచ్చన్నారు. పనుల్లో భద్రతా నియమాలు విధిగా పాటించాలన్నారు. పగటిపూట వీధిలైట్లు వెలగకుండా తగు చర్యలు తీసుకొని విద్యుత్ వృథాను అరికట్టాలన్నారు. వినియోగదారులతో వాట్స్‌అప్ గ్రూపులను ఏర్పాటు చేసి వారి విద్యుత్ సమస్యలను పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో లోఓల్టేజీ సమస్య రాకుండా కొత్త ట్రాన్స్‌పార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు. రైతుల విద్యుత్ సరఫరా లైన్లలో తలెత్తే సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. విధుల పట్ల అలసత్వం వహించే ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో డీఈ శివయ్య, జేఈ మౌసీన్, సిబ్బంది పాల్గొన్నారు.
26పీఎల్‌ఆర్35బి:
విద్యుత్ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేస్తున్న ఎస్‌ఈ రమణ
Comments
Please login to add a commentAdd a comment