ప్రజలకు ‘షాక్’ ఇస్తోన్న కూటమి సర్కారు
జిల్లా ప్రజలపై సుమారు రూ. 8–10 కోట్ల నెలవారి బారం
విద్యుత్‌చార్జీల పెంపుపై నేడు వైఎస్సార్ సీపీ పోరుబాట
సాక్షి రాయచోటి: ఇక నుంచి చలికాలమైనా..ఎండా కాలమైనా..వినియోగదారులకు కరెంటు సెగ మాత్రం తప్పదు. ఎందుకంటే ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో కూటమి సర్కార్ వినియోగదారులపై పిడుగు వేసింది. ప్రతిసారి ఎన్నికలకు ముందు అది చేస్తాం..ఇది చేస్తామంటూ ఊదరగొట్టే బాబు ఈసారి సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా కరెంటుచార్జీలు పెంచబోమంటూ పదేపదే ప్రజల ముందు హామీలు గుప్పించారు. అధికారంలోకి రాగానే ఐదేళ్లు ఎవరేమి చేయలేనట్లు యథావిధిగా ఏడు నెలల పాలనలోనే కరెంటుచార్జీల పెంపునకు చంద్రబాబు సర్కార్ తెర తీసింది. ధనికుడైనా, సామాన్యుడైనా వాడిన కరెంటుకు బిల్లు మాత్రం అప్పటికీ ఇప్పటికీ తేడా ఈ నెలలోనే కనిపించనుంది. జిల్లా ప్రజలపై కరెంటు బిల్లులు పెనుభారంగా మారనున్నాయి.
ఎన్నికలకు ముందు ఒకటి... అధికారం వచ్చాక మరొకటి
చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు చూసినా ఎన్నికలకు ముందు ఒకమాట చెప్పడం, అఽధికారంలోకి వచ్చాక మరొకటి చెప్పడం అలవాటుగా మారింది. మొన్నటికి మొన్న అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పేరుతో సుపరిపాలన అందిస్తామని గొప్పలు చెప్పి తీరా ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ అమలు చేయకుండా కుంటి సాకులు చెబుతున్నారు. ఇలా ప్రతి హామిలోనూ ఏదో ఒక సాకుతో ప్రజలకు ఇచ్చిన మాటను సర్కార్ మాయ చేస్తోంది. అలాగే విద్యుత్ ఛార్జీల విషయంలోనూ పెంచబోమని హామి ఇచ్చి అఽధికారంలోకి వచ్చాక ఛార్జీలతోపాటు సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment