●ప్రజలపై అదనపుభారం
జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు సంబంధించి గృహ, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, విద్యా సంస్థలు, ఆలయాలు, మసీదు, చర్చిలు, వీధి దీపాలు ఇలా అన్ని రకాల వినియోగదారులకు వడ్డన మొదలైంది. ఏపీఎస్ పీడీసీఎల్ ఇప్పటికే ఒకసారిచార్జీలు పెంచగా, ఈనెలలో సర్దుబాటు పేరుతో ఒక్కోయూనిట్‌కు ఒక్కసారి 60 పైసలు, మరోసారి 61 పైసలు కలుపుకుని రూ.1.21 పైసలు వసూలు చేస్తోంది. ఏప్రిల్ నెలలో వాడిన విద్యుత్ యూనిట్లకు సంబందించి సర్దుబాటు ఛార్జీల పేరుతో భారాన్ని ప్రజలపై మోపనున్నారు. దీంతో పెద్ద ఎత్తున బిల్లుల మోత మోగనుంది. జిల్లాలోని అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి 7,14,532 కనెక్షన్లు ఉండగా, అందులో గృహాలకు సంబంధించి 5,09,417 ఉన్నాయి. ఈనెల నుంచి ప్రజలపై భారం పడనుండగా విద్యుత్‌శాఖకు సుమారు రూ. 8–10 కోట్ల మేర అదనపు మొత్తాలు పెరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment