ప్రతి రైతు ఇ–క్రాప్‌ చేయించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి రైతు ఇ–క్రాప్‌ చేయించుకోవాలి

Published Fri, Dec 27 2024 2:34 AM | Last Updated on Fri, Dec 27 2024 2:34 AM

ప్రతి రైతు ఇ–క్రాప్‌ చేయించుకోవాలి

ప్రతి రైతు ఇ–క్రాప్‌ చేయించుకోవాలి

చిన్నమండెం: ప్రతి రైతు తప్పనిసరిగా ఇ–క్రాప్‌ నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖాధికారి చంద్రానాయక్‌ అన్నారు. గురువారం చిన్నమండెం మండలం దిగువగొట్టివీడు రైతు సేవా కేంద్రం పరిధిలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ సీజన్‌లో సాగు చేసిన పంటలను రైతులు ఇ–క్రాప్‌ నమోదు చేసుకోవాలని, ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. వరి, మామిడి, టమోటాలకు ఇన్సూరెన్స్‌ చేయించుకుంటే ఒక ఎకరాకు వరికి రూ.126, టమాటాకు రూ.1600, మామిడికి రూ.2250 వస్తుందన్నారు. ఈ నెల 31వ తేదీలోగా రైతులు ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌ రాజేష్‌, రైతులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement