●నేడు వైఎస్సార్ సీపీ విద్యుత్ పోరు
అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడు నెలలు కాకముందే ప్రజల నడ్డి విరుస్తూ సామాన్యులపై భారం మోపతున్న కూటమి సర్కార్ తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఉద్యమబాట పడుతోంది. చంద్రబాబు సర్కార్ ఇప్పటికే రైతులను విస్మరించిన నేపథ్యంలో ఈనెల 11న జిల్లా కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు మరోమారు ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు వైఎస్సార్ సీపీ సన్నద్దమైంది. ఇందులో భాగంగా పెంచిన విద్యుత్ ఛార్జిలను తగ్గించాలని, సామాన్యులపై భారం పడకుండా చర్య లు తీసుకోవాలని...విద్యుత్ ఛార్జీలు, సర్ ఛార్జిల పేరుతో అదనపు బారం మోపుతున్న సర్కార్ తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం పెద్ద ఎత్తున జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, వినతిపత్రాలను సముర్పించనున్నారు. రాజంపేటలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, తంబళ్లపల్లెలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, రైల్వేకోడూరులో మాజీ ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, రాయచోటిలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పీలేరులో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీ శ్రేణులతోపాటు అన్ని వర్గాలు కదిలివచ్చేలా పార్టీ నేతలు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment