ఆర్‌బీఎస్‌కే స్క్రీనింగ్ పరీక్షల పరిశీలన
సిద్దవటం: మండలంలోని శాఖరాజుపల్లె పంచాయతీ మోదీన్‌సాబ్‌పల్లె ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు జరుగుతున్న రాష్ట్రీయ బాలల సురక్షా స్క్రీనింగ్ (ఆర్‌బీఎస్‌కే) పరీక్షల కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి నాగరాజు పరిశీలించారు. గురువారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలు ప్రతి ఒక్కరికీ ముందస్తు పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఏవైనా జన్యులోపాలు, శరీర భాగాలకు సంబంఽధించిన వ్యాధులు ఉంటే ఆరోగ్య కార్యకర్తలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆశావర్కర్ల సాయంతో వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లేదా సర్వజన ఆసుపత్రులకు పంపించి వారి వివరాలను సంబంఽధిత యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ఇందుకోసం రిమ్స్‌లోని జిల్లా అత్యవసర సమాచార కేంద్రంలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామని, అక్కడ వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారన్నారు. నిర్దేశించిన వ్యవధిలో రోజుకు 30 మంది చొప్పున పిల్లలకు స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని సూచించామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment