ప్రొద్దుటూరు : ప్రేమకు కులమతాలతోపాటు దేశ సరిహద్దులు కూడా అడ్డు రావని వారు నిరూపించారు. ప్రొద్దుటూరుకు చెందిన అరకటవేముల లక్ష్మీనారాయణ, సుశీల కుమారుడు శ్రీహర్ష.. పోలాండ్ దేశానికి చెందిన జన్ పౌలుస్, బొగ్గుమిళ వ్రోబెల్ కుమార్తె అక్షరను సంప్రదాయబద్ధంగా గురువారం వివాహం చేసుకున్నారు. ప్రొద్దుటూరులోని రాయల్ కౌంటి రిసార్ట్స్‌లో ఈ వివాహం జరిగింది. పెద్ద సంఖ్యలో బంధు మిత్రులు హాజరై వధూవరులను ఆశ్వీరదించారు. శ్రీహర్ష ఎంఎస్ చదివేందుకు స్వీడన్ వెళ్లాడు. పోలాండ్‌కు చెందిన అర్చన అదే కళాశాలలో చదువుతుండేది. చదువు పూర్తి చేసుకున్న ఇరువురు అక్కడే సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు. కళాశాలలో చదువుకున్న రోజుల నుంచి ప్రేమించుకున్న వీరు కుటుంబ పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. పోలాండ్ దేశానికి చెందిన పలువురు వివాహానికి హాజరయ్యారు.
ప్రొద్దుటూరు అబ్బాయికి,
పోలాండ్ అమ్మాయికి వివాహం
26పిడిటిఆర్ 03బీ –
వివాహం చేసుకున్న అక్షర, శ్రీహర్ష
Comments
Please login to add a commentAdd a comment