కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

Published Fri, Dec 27 2024 2:33 AM | Last Updated on Fri, Dec 27 2024 2:33 AM

కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

సింహాద్రిపురం : కారు ఢీకొన్న ప్రమాదంలో గురువారం ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కసనూరు గ్రామానికి చెందిన నీలకంఠారెడ్డి(55) పశువుల గడ్డి కోసం బైక్‌పై అంకాలమ్మ గూడూరు – అగ్రహారం గ్రామాల మధ్యలో ఉన్న పీబీసీ కాలువ సమీపంలో వెళ్తున్నాడు. అతన్ని సింహాద్రిపురం నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నీలకంఠారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో భారీ సంఖ్యలో జనాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement