గృహ నిర్మాణం, లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధ
రాయచోటి/గాలివీడు : జిల్లాలోని అన్ని లే అవుట్లలో గృహ నిర్మాణ పూర్తికి, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.రాజాబాబు, జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్‌లు లబ్ధిదారులతో పేర్కొన్నారు. మంగళవా రం జిల్లాలోని హౌసింగ్ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించేందుకు జిల్లా కేంద్రానికి వచ్చిన ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌కు రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్‌లో కలెక్టర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ లేఅ వుట్లలో ఉన్న ఇళ్ల నిర్మాణ ప్రగతి, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై వారు చర్చించారు.
లేఅవుట్ల పరిశీలన
రాయచోటి మండలం దిగువ అబ్బవరం ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఉన్న లేఅవుట్లు, అలాగే గాలివీడు మండలం గుర్రాలమిట్ట ఉర్దూ పాఠశాల ఎదురుగా ఉన్న హౌసింగ్ లేఅవుట్‌లను జిల్లా కలెక్టర్, గృహ నిర్మాణ కార్పొరేషన్ ఎండీలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. స్థానికంగా నివాసం ఉన్న లబ్ధిదారులతో సమస్యల గురించి చర్చించారు. ఈ సందర్భంగా తాగునీటి సమస్య, అంతర్గత రోడ్ల సమస్యలను లబ్ధిదారులు వారి దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ శివయ్య, ఈఈలు, డీఈఏలు, ఏఈలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్
మేనేజింగ్ డైరెక్టర్ కె.రాజాబాబు
Comments
Please login to add a commentAdd a comment