బి.కొత్తకోట : రాష్ట్ర ఉద్యానవనశాఖ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు బుధవారం తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మండలంలోని కోటావూరు గ్రామానికి చేరుకుని ఇక్కడ డ్రాగన్ పంటను సాగు చేస్తున్న రైతులతో ముఖాముఖ మాట్లాడతారు. అనంతరం గ్రామ హార్టికల్చర్ అసిస్టెంట్లతో సమావేశం అవుతారు. తర్వాత గట్టు, బయ్యప్పగారిపల్లె గ్రామాల్లో మామిడి, అవకాడో సాగును పరిశీలిస్తారు. పెద్దతిప్పసముద్రం మండలంలోని కాయలవాండ్లపల్లెలో రోజా పూల సాగు, మద్దయ్యగారిపల్లెలో రైతులతో ముఖాముఖి, రైతు ఉత్పతిదారుల సంఘంతో సమావేశాలు నిర్వహించి రీలింగ్ యూనిట్‌ను సందర్శిస్తారు. తర్వాత ములకలచెరువులోని వ్యవసాయ మార్కెట్ యార్డును పరిశీలిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment