చిట్వేలి : చిట్వేలి సింగనమల వీధి (జెండా మాను) దగ్గర శుక్రవారం తెల్లవారుజామున 11కేవీ విద్యుత్ లైన్ తెగి షేక్ సాబేరా రేకుల గృహంపై పడింది. ఇంటిలోని ప్రిజ్, ఫ్యాన్‌లు, లైట్లు, స్విచ్‌బోర్టు వంటి సుమారు రూ.50 వేల ఆస్తినష్టం జరిగినట్లు బాధితురాలు తెలిపారు. తమకు పరిహారం ఇప్పించాలని ఆమె కోరారు.
రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని వృద్ధుడి మృతి
ములకలచెరువు : స్థానిక రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కదిరి రైల్వే ఇన్‌చార్జి ఎస్‌ఐ మహబూబ్‌బాషా కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 70 ఏళ్ల వృద్ధుడు తరుచూ రైల్వేస్టేషన్‌లోనే ఉండే వాడు. స్థానికంగా భిక్షాటన చేసి రాత్రి సమయాల్లో రైల్వేస్టేషన్‌కి వచ్చి నిద్రపోయేవాడు. ఆరోగ్యం దెబ్బతినడంతోనే వృద్ధుడు చనిపోయాడని పోలీసులు తెలిపారు. వృద్ధుడి జేబులో తనకల్లు నుంచి ములకలచెరువుకు ఆర్టీసీ బస్సులో వచ్చినట్లు టికెట్టు ఉందని వారు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment