బేల్దారి కుటుంబంపై టీడీపీ వర్గీయుల దాడి
రాజంపేట : రాజంపేట మండలం ఉప్పరపల్లెలో టీడీపీ వర్గీయులు.. గ్రామస్తుడు, బేల్దారి పని చేసుకునే మీసాల వెంకటేశు ఇంటిపై దాడి చేసిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ గొడవకు మురికినీటి నిల్వలపై మట్టిపోసి పూడ్చడమే కారణంగా చూపుతున్నా.. టీడీపీ వర్గీయులు పాతకక్షలను దృష్టిలో పెట్టుకొని దౌర్జన్యానికి దిగినట్లు గ్రామస్తులు చెప్పుకొంటున్నారు. బేల్దారి కూలి మీసాల వెంకటేశుకు సంబంధించిన వారిపై దొంతం ఈశ్వరయ్యకు చెందిన సుమారు 24 మంది మూకుమ్మడిగా దాడి చేశారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. తనను రక్షించుకునేందుకు బాధితుడు తమ వారితో తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు అంటున్నారు. వీరంతా ఒకటే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం.
ఉప్పరపల్లెలో ఉద్రిక్తత
ఉప్పరపల్లెలో ఉద్రిక్తతగా పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న మన్నూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని లాఠీలతో చెదరగొట్టారు. కాగా గతంలో ఇరువర్గాల మధ్య దాడులు జరిగాయి. కేసులు కూడా నమోదయ్యాయి. అయినప్పటికీ అదేమి లెక్క చేయకుండా ఘర్షణకు దిగారంటే, వీరి వెనుక టీడీపీ స్థానిక నేత హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నామమాత్రపు కేసుతో..
మీసాల వెంకటేష్ సంబంధీకులపై 25 మంది టీడీపీ వర్గీయులు దాడి చేస్తే మన్నూరు పోలీసులు నామమాత్రపు కేసు కట్టి చేతులు దులుపుకొన్నారని బాధిత వర్గీయులు వాపోతున్నారు. పైగా మన్నూరు పోలీసుస్టేషన్ వద్ద మకాం వేసి టీడీపీ నేత గంపశివ తమపై దాడి చేసిన వారితో రాజీ కావాలని ఒత్తిడి చేస్తున్నారని మీసాల వెంకటేశు మీడియాకు తెలిపారు. టీడీపీ నేత ఒత్తిడికి పోలీసులు తలొగ్గారని విమర్శలు వెలువడ్డాయి.
నామమాత్రపు కేసు పెట్టారంటూ
బాధితుల ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment