● జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్
రాయచోటి: ప్రభుత్వ గృహ నిర్మాణ లే అవుట్లలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శనివారం రాయచోటి మండలం, దిగువ అబ్బవరం పరిధిలోని ప్రభుత్వ లే అవుట్‌ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. అబ్బవరం లే అవుట్, ఏపీ మోడల్ స్కూల్ ఎదురుగా ఉన్న లే అవుట్లలో సీసీ రోడ్ల నిర్మాణ ప్రగతి, విద్యుత్ స్తంభాలు, లైన్ల ఏర్పాటు, నీటి వసతి, ఇతర మౌలిక వసతుల కల్పన, ఆర్చీ నిర్మాణం తదితర అంశాంలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్‌ఈ దయాకర్ రెడ్డి, హౌసింగ్, డ్వామా పీడీలు శివయ్య, వెంకటరత్నం, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ ప్రసన్న కుమార్, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ, హౌసింగ్ డీఈ సుబ్బరామయ్య, ఏఈ రామ్మోహన్ రెడ్డి, తహసీల్దార్ పుల్లారెడ్డి, ఎంపీడీఓ వెంకటేష్, విద్యుత్, హౌసింగ్ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment