అగ్గిపుల్లే.. అగ్గి పుల్లే!
కురబలకోట: సినీ హీరో కిరణ్ అబ్బవరం శనివారం రాత్రి అంగళ్లులో సందడి చేశారు. వచ్చే నెల 14న విడుదల కానున్న దిల్ రూబా సినిమాలోని అగ్గిపుల్లే అనే పాటను అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో అట్టహాసంగా విద్యార్థుల హర్షధ్వానాల మధ్య విడుదల చేశారు. అంతకు ముందు ప్రదర్శించిన టీజర్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ విశ్వకరుణ్ దర్శకత్వంలో హీరోయిన్‌గా రుక్సానా ధిల్లాన్ నటిస్తున్న దిల్ రూబా సినిమాను వచ్చే నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నామన్నారు. లవ్, రొమాంటిక్, యాక్షన్, ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను చిత్రీకరించామన్నారు. ఈ సినిమాను ఆదరించాలని హీరోయిన్ రుక్సాన్ ధిల్లాన్ కోరారు. కిరణ్ అబ్బవరం చిత్ర యూనిట్, విద్యార్థులతో కలసి స్టెప్పులేశారు. ఆర్‌ఆర్‌ఆర్ అకాడమి ప్రెసిడెంట్ నాదేళ్ల ద్వారకానాథ్ పాల్గొన్నారు.
అంగళ్లులో అల్లరి చేసిన కిరణ్ అబ్బవరం
దిల్ రూబా మూవీ తొలి పాట విడుదల
Comments
Please login to add a commentAdd a comment