రైల్వేకోడూరు అర్బన్: మన చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే మనం సమాజానికి చేసే సేవ అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రామచంద్రన్ అన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛదివస్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌తో కలిసి పాల్గొన్నారు. ఎర్రచందనం పార్కులో మానవహారం ఏర్పాటు చేసి అవగాహన ర్యాలీ ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో చీపురుతో శుభ్రం చేసి ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ దివస్‌ను పాటించి స్వచ్ఛ కోడూరుగా మార్చాలని పిలుపునిచ్చారు.
ఆసుపత్రి ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్న జేసీ, విప్
Comments
Please login to add a commentAdd a comment