ఎన్టీఆర్ వర్థ్ధంతి సాక్షిగా.. వర్గపోరు బహిర్గతం
వేర్వేరుగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు
మదనపల్లె: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా శనివారం టీడీపీలో వర్గపోరు బహిర్గతమైంది. పట్టణంలోని కదిరిరోడ్డులో ఎన్‌టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు వేర్వేరుగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే షాజహాన్‌బాషా తన వర్గంతో కలిసి నిమ్మనపల్లె సర్కిల్, ఎన్‌టీఆర్ సర్కిల్, సీటీఎం క్రాస్‌లో ఎన్‌టీఆర్‌కు నివాళులర్పించారు. తామే టీడీపీకి అసలైన వారసులమంటూ...తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, దొమ్మలపాటి యశస్విరాజ్, యాలగిరి దొరస్వామినాయుడు, జనసేన నాయకులు గంగారపు రామదాస్‌చౌదరి, జంగాల శివరాం తదితరులు మరో జట్టుగా ఎన్‌టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్‌బాషా మాట్లాడుతూ ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అని నమ్మిన ప్రజానాయకుడు ఎన్‌టీఆర్ అన్నారు. శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ..పార్టీలో కొత్తగా వచ్చిన వారి మాటలు విని పనిచేస్తే ఒప్పుకునేది లేదని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదని, అవసరమైతే ట్రాన్స్‌ఫర్‌లు చేయించేందుకు వెనుకాడమని అధికారులను హెచ్చరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment