● నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయండి
మైదుకూరు పర్యటనలో సీఎం చంద్రబాబు రిక్తహస్తం
● అభివృద్ధి చేస్తామంటూనే గల్లా పెట్టే ఖాళీ అని వ్యాఖ్యలు
● మైదుకూరు అభివృద్ధిపై ఎమ్మెల్యే పుట్టా విజ్ఞప్తులను తోసిపుచ్చిన సీఎం
రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే టీడీపీ మూడో తరం నాయకుడు మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. మైదుకూరులో ఎన్టీ రామారావు వర్థంతి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై పవన్ కల్యాణ్ ఓపెన్‌గా మాట్లాడుతుండటంపై టీడీపీలో ఒకింత అసహనం మొదలైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వాసు వ్యాఖ్యలు ఎలాంటి మార్పులకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment