అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట ఏదీ.! | - | Sakshi
Sakshi News home page

అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట ఏదీ.!

Published Mon, Jan 20 2025 12:35 AM | Last Updated on Mon, Jan 20 2025 12:35 AM

అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట ఏదీ.!

అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట ఏదీ.!

సిద్దవటం : మండలంలోని డేగనవాండ్లపల్లె, మాచుపల్లె, టక్కోలు గ్రామాల సమీపంలోని పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా అధికారులు అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రతి రోజు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా కడపకు తరలిస్తున్నారని, ఈ విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఆదివారం కూడా పెన్నానది నుంచి ఇసుక తరలిపోయిందన్నారు. ఈ విషయమై ఒంటిమిట్ట సీఐ బాబును వివరణ కోరగా ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు గత కొన్ని రోజులుగా దాడులు జరుపుతున్నామన్నారు. ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement