జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణంలోని నాగలకట్ట కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మీ ప్రసన్న (32) అనే వివాహిత ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పట్టణ సీఐ ఎస్.లింగప్ప కథనం మేరకు.. లక్ష్మీ ప్రసన్న తన హరి కిరణ్ శర్మతో కలిసి గత కొంత కాలం నుంచి నాగలకట్ట కాలనీలో కాపురం ఉంటున్నారు. ఆమె భర్త కాలనీలో ఉన్న శ్రీ చౌడేశ్వరి ఆలయంలో పూజారిగా ఉన్నాడు. వీరి మధ్య తరచూ కలహాలు జరిగేవి. దీంతో జీవితంపై విరక్తి చెంది శనివారం అర్థరాత్రి ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చి గమనించిన భర్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మస్కట్‌లో కడప వాసి మృతి
కడప అర్బన్ : కడప నగరంలోని బిస్మిల్లా నగర్‌కు చెందిన షేక్ మహమ్మద్ అనీష్ అన్సారీ (35) అనే వ్యక్తి మస్కట్‌లో మృతి చెందాడు. జీవనోపాధికోసం వెళ్లిన అన్సారీ గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని మస్కట్ నుంచి స్వదేశానికి రప్పించాలని మంత్రి లోకేష్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా స్థానికులు సమాచారం ఇచ్చారు. ఈమేరకు లోకేష్ స్పందించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అన్సారీ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తానని తెలియజేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment