ఆటో –కారు ఢీ
వల్లూరు (చెన్నూరు) : చెన్నూరు మండలం స్థానిక గోపవరం క్రాస్ శ్యామలాదేవి గుడి వద్ద ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చెన్నూరు మండలం గోపవరానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. సీఐ పురుషోత్తం రాజు ప్రమాదానికి కారణమైన కారును పోలీసు స్టేషన్‌కు తరలించారు.
కారు ఢీకొని వ్యక్తి మృతి
కొండాపురం : తాడిపత్రి– కడప జాతీయ రహదారిలోని కె. వెంకటాపురం గ్రామ సమీపంలో సాయిబాబా గుడి ఎదురుగా ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొన్న సంఘటనలో వ్యక్తి మృతి చెందాడు. తాళ్ల ప్రొద్దుటూరు ఎస్‌ఐ హృషికేశ్వరరెడ్డి కథనం మేరకు వివరాలు.. కొండాపురం మండలం చౌటిపల్లె గ్రామానికి చెందిన పోలుగారి సుబ్బరాయుడు (49) ఆదివారం ద్విచక్ర వాహనంపై తాడిపత్రికి వెళుతుండగా మార్గ మధ్యంలో వెంకటాపురం వద్ద కారు అతి వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఫినాయిల్ బాటిళ్లు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. ఇతనికి కుమారుడు, కూతురు, భార్య ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment