ఎవరేమనుకున్నా..తగ్గేదేలే.!
సాక్షి టాస్క్‌ఫోర్సు: సంక్రాంతి పండగను పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో గోదావరి జిల్లాలను తలపింపజేసేలా కోడిపందేలను జోరుగా నిర్వహించారు. ముదివేడు గ్రామం గొల్లపల్లె సమీపంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే దాకా కాయ్ రాజా కాయ్ అన్నట్లుగా జోరుగా కోడిపందెం సాగింది. అన్నమయ్య జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున పందెం జరగడం ఇక్కడేనని భావిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం పట్టించుకున్న పోలీసులు లేరంటే ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. విచిత్రమేమంటే ముదివేడు పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఈ కోడి పందెం జరగడం మరో విశేషం. పెద్ద సంఖ్యలో జనం హాజరై కోడి పందేలను ఎంజాయ్ చేశారు. కోడి పందెం పెద్ద ఎత్తున సాగడంతో బెట్టింగులు కూడా లక్షల్లో సాగినట్లు చెబుతున్నారు. పరోక్షంగా పోలీసుల అనుమతి కూడా ఉందని గ్రహించిన జనం చూసేందుకు పరిసర ప్రాంతాల వారే కాకుండా దూర ప్రాంతాల వారు కూడా వచ్చారు. బెట్టింగులతో కొందరు లాభ పడ్డారు. పలువురు జేబులు గుల్ల చేసుకున్నారు. ఇంత బరితెగింపుగా ఎన్నడూ కోడి పందేలు జరగలేదని పలువురు చెబుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులకు పోలీసులు తొత్తుగా మారడంతో ఇలా యథేచ్ఛగా కోడి పందేలు జరిగినట్లు భావిస్తున్నారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఏకక్షంగా వ్యవహరిస్తున్న ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌పై తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. లేదంటే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
కాలు దువ్విన పందెం కోళ్లు
ముదివేడు దగ్గర జాతరలా కోడి పందెం
Comments
Please login to add a commentAdd a comment