ముంచిన కలుపు నివారణ మందు
సింహాద్రిపురం : కలుపు మందుతో ఏకంగా రైతు తన పంటనే కోల్పోయిన సంఘటన వైఎస్‌ఆర్ జిల్లా రావులకొలను గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మహేష్‌రెడ్డికి నాలుగు ఎకరాల సొంత పొలం ఉంది. అదే గ్రామానికి చెందిన రామ్మోహన్‌రెడ్డికి చెందిన 15 ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు.
ఖరీఫ్ సీజన్‌లో పంట చేతిక అందక పోవడంతో రబీపై ఆశలు పెట్టుకుని గత ఏడాది డిసెంబర్ 9న పులివెందులలోని గురుబాలాజీ ఫర్టిలైజర్ షాపులో నల్ల నువ్వులు కొనుగోలు చేశాడు. కౌలుకు తీసుకున్న 15 ఎకరాల్లో డిసెంబర్ 11న నువ్వుల పంటను సాగు చేశాడు. అయితే అదే ఫర్టిలైజర్ షాపు వారి సలహా మేరకు కలుపు నివారణ మందు కొని డిసెంబర్ 12న పంటకు పిచికారీ చేశాడు. మందు చల్లినా పంట ఎదుగుదల లేకపోవడంతో నీటి తడులు అందించాడు. అయితే మందు చల్లిన పంట పూర్తిగా దెబ్బతినింది. మందు తక్కువ రావడంతో 20 సెంట్ల నువ్వుల పంటకు పిచికారీ చేయలేదు. ఆ పంట మాత్రం బాగానే ఉందని రైతు అంటున్నాడు. కలుపు నివారణ మందు పిచికారీ చేసిన పంట మాత్రమే పూర్తిగా దెబ్బతినిందని రైతు వాపోతున్నాడు. 15 ఎకరాల్లో పంట సాగుకు, మందులకు సుమారు రూ.3 లక్షల ఖర్చు చేశామని రైతు అంటున్నాడు. నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యమని రైతు వాపోతున్నాడు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కలిసి విన్నవించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా మండల వ్యవసాయ అధికారి శివమోహన్ నువ్వుల పంటను పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామన్నారు.
నువ్వుల పంటకు తీవ్ర నష్టం
నష్టపరిహారం ఇవ్వకపోతే ఆత్మహత్యే
శరణ్యమంటున్న రైతు
Comments
Please login to add a commentAdd a comment