పిచ్చి కుక్క వీరంగం●
ములకలచెరువు : ఒక పిచ్చి కుక్క వీరంగం సృష్టించి సుమారుగా 20 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన ఆదివారం మండలంలో కలకలం రేపింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనతో హడలెత్తిపోయారు. స్థానికులు, వైద్య సిబ్బంది కథనం మేరకు వివరాలు... మండలంలోని చౌడసముద్రం, దేవులచెరువు, అడివిచెరువు, అడివినాయనచెరువుపల్లి, గట్టుకిందపల్లె గ్రామాల్లో ఒక పిచ్చి కుక్క వృద్ధులు, యువకులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఇళ్లలో నుంచి వచ్చేందుకు సాహసించలేదు. ఇళ్ల తలుపులు మూసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. పిచ్చికుక్క మాత్రం స్వైర విహారం చేస్తూ ఎదురు పడిన వారిపై దాడికి పాల్పడింది. ములకలచెరువు పీహెచ్‌సీలో ఏ.మంజుల(35), ఎస్.లోకేష్(32), కె.చంద్రారెడ్డి(55), డి.వెంకటలక్ష్ముమ్మ(46), జి.వెంకటప్ప(55), బి.గంగాద్రి(32), ఎస్.అంజన్న(30), జి.శ్రీనివాసులు(43), ఎస్.మహ్మద్(25) తదితరులు చికిత్స పొందారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మిగిలిన వారు మదనపల్లె ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు.
● 20 మందిపై దాడి
● పలువురి పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment