శతాధిక వృద్ధురాలి మృతి
పీలేరు : మండలంలోని యల్లమంద పంచాయతీ నగిరికి చెందిన వీరనాగమ్మ నాయకురాలు (115) అనే శతాధిక వృద్ధురాలు శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరనాగమ్మకు కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనమరాళ్లు, ముని మనవళ్లు, మునిమనవరాళ్లతోపాటు వివాహాలైన వారి పిల్లలు కూడా ఉన్నారు. వారం రోజుల క్రితం వరకు కూడా ఎవరిపై ఆధారపడకుండా తన పనులు తానే చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండేది. వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు కిందపడి గాయపడి శనివారం మృతి చెందింది.
ప్రైవేటు బస్సు ఢీకొని
ఒకరి మృతి
రామసముద్రం : రామసముద్రం మండలం ఎలకపల్లి పంచాయతీ కురప్పల్లె గ్రామానికి చెందిన జి. నారాయణస్వామి (55) ప్రైవేట్ బస్సు ఢీకొని మృతి చెందాడు. కర్ణాటక పోలీసుల కథనం మేరకు మండలానికి చెందిన నారాయణ స్వామి పని నిమిత్తం కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా శ్రీనివాసపురం తాలూకా లక్ష్మీపురం వెళ్లాడు. అక్కడ మదనపల్లి నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేట్ బస్సు ఢీకొని మృతి చెందాడు. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎవరీ వృద్ధురాలు.!
కడప అర్బన్ : కడప నగరంలోని మాసాపేటలో ఓబుళమ్మ అనే వృద్ధురాలిని స్థానికులు గుర్తించారు. ఆమెను ఏ ఊరని అడిగితే తనది మాధవరం చిన్నపురెడ్డిపల్లె అని చెబుతోంది. తనను ఆటోలో తీసుకువచ్చి ఇక్కడ వదిలేసి వెళ్లారంటోంది. ఆమెకు సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో స్థానికులు ఆమెను రిమ్స్ సమీపంలోని పద్మావతి వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఆమె బంధువులు ఎవరైనా ఉంటే 95508 74906 నంబరులో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment