జిల్లా కేంద్రమైన రాయచోటిలోనూ కిందిస్థాయి క్యాడర్‌లో అసమ్మతితోపాటు వర్గ విబేధాలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల కిందట లక్కిరెడ్డిపల్లెలో టీడీపీలోని రెండు వర్గాల వారు దాడులు చేసుకున్నారు. సంక్రాంతికి ముందుకూడా రాయచోటిలోని గునికుంట్ల రోడ్డు చివరన ఉన్న చెరువుకట్టవద్ద ఇరు వర్గాలు రాడ్లతో కొట్టుకోగా, మళ్లీ ఆ రెండు వర్గాల మధ్య జగదాంబసెంటర్ వీధిలోనూ గొడవ జరిగి ఒక టాటూ సెంటర్‌కు నిప్పు పెట్టారు. ఇలా రాయచోటిలో కార్యకర్తలు, నేతల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల పది రోజుల వ్యవధిలో రాయచోటిలో సుగవాసి వర్గీయుల బ్యానర్‌ను మంత్రి వర్గీయులు తొలగించగా.. మంత్రి అనుచరులు ఏర్పాటుచేసిన బ్యానర్‌ను సుగవాసి వర్గానికి చెందినవారు చించివేశారు. ఈనేపథ్యంలో మంత్రి అనుచరులు పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయడం కాక రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment