Today Horoscope: ఈ రాశివారికి కొత్త వ్యక్తులతో పరిచయం, శుభవార్తలు వింటారు..! | Today Telugu Horoscope On July 22nd, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి కొత్త వ్యక్తులతో పరిచయం, శుభవార్తలు వింటారు..!

Published Mon, Jul 22 2024 6:20 AM | Last Updated on Mon, Jul 22 2024 8:59 AM

Daily Horoscope On July 22 2024 In Telugu

శ్రీ∙క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు; ఆషాఢ మాసం; తిథి: బ.పాడ్యమి ప.2.41 వరకు; తదుపరి విదియ, నక్షత్రం: శ్రవణం రా.12.58 వరకు; తదుపరి ధనిష్ఠ; వర్జ్యం: తె.4.46 నుండి 6.17 వరకు (తెల్లవారితే మంగళవారం); దుర్ముహూర్తం: ప.12.31 నుండి 1.23 వరకు, తదుపరి ప.3.06 నుండి 3.58 వరకు; అమృత ఘడియలు: ప.2.56 నుండి 4.24 వరకు;  రాహుకాలం:  ఉ.7.30 నుండి 9.00 వరకు; యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు; సూర్యోదయం:  5.39;  సూర్యాస్తమయం:  6.33 

మేషం...పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం...ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం....పనులలో ఆటంకాలు. ఆరోగ్యభంగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

కర్కాటకం...సన్నిహితులు, శ్రేయోభిలాషులతో సఖ్యత. పనులలో విజయం. శుభవార్తలు వింటారు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహం...సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.

కన్య...వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల....పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో కొద్దిపాటి సమస్యలు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృశ్చికం...సోదరుల నుంచి ధనలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. భూలాభాలు. వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి.

ధనుస్సు..వ్యవహారాలలో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మకరం...కొత్త పరిచయాలు. బంధువుల నుంచి శుభవార్తలు. మిత్రులతో వివాదాలు పరిష్కారం. ఆసక్తికర సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

కుంభం....వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం..నూతన ఉద్యోగయత్నాలు సఫలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement