శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.పంచమి ఉ.9.47 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: ఉత్తరాషాఢ రా.1.18 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ఉ.10.07 నుండి 11.36 వరకు, తదుపరి తె.5.03 నుండి 6.34 వరకు (తెల్లవారితే ఆదివారం), దుర్ముహూర్తం: ఉ.6.11 నుండి 7.39 వరకు, అమృతఘడియలు: రా.7.11 నుండి 8.44 వరకు, నాగపంచమి; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.09, సూర్యాస్తమయం: 5.21.
మేషం.... కొత్త మిత్రుల పరిచయం. శుభవర్తమానాలు అందుతాయి. శ్రమ ఫలిస్తుంది. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో హోదాలు.
వృషభం.... పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
మిథునం... వ్యవహారాలు మందగిస్తుంది. ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాల సందర్శనం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
కర్కాటకం... కాంట్రాక్టులు లభిస్తాయి. కొత్త పనులు చేపడతారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పైస్థాయి నుంచి గుర్తింపు.
సింహం.... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
కన్య.... వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
తుల...... శ్రమపడ్డా పనులు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.
వృశ్చికం.. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ. ధనప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.
ధనుస్సు.... బంధువుల నుంచి వివాదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. కష్టపడ్డా ఫలితం ఉండదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.
మకరం.... కొత్త పనులు చేపడతారు. ధనలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. వాహనసౌఖ్యం. నిర్ణయాలలో మార్పులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ఊహలు నిజం కాగలవు.
కుంభం... పనులలో అవాంతరాలు తొలగుతాయి. ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. కోర్టు వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.
మీనం... కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో ఆటంకాలు. అనారోగ్యం. ధనవ్యయం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో పనిభారం.
Comments
Please login to add a commentAdd a comment