కార్యక్రమంలో మాట్లాడుతున్న ఐఎంఏ చీరాల అధ్యక్షురాలు డాక్టర్ శ్రీదేవి
చీరాల: సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు చీరాలకు రావడం హర్షించదగిన విషయమని ఐఎంఏ చీరాల అధ్యక్షురాలు డాక్టర్ పీ శ్రీదేవి అన్నారు. చీరాలకు చెందిన ధృతి సూపర్ స్పెషాలిటీ క్లీనిక్స్ ఆధ్వర్యంలో వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లతో ఆదివారం స్థానిక ఐఎంఏ హాలులో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి శ్రీదేవి, కార్యదర్శి డాక్టర్ పి.శ్రీకాంత్‌లు హాజరై మాట్లాడారు. చీరాల పరిసర ప్రాంత ప్రజలకు గుంటూరు, విజయవాడ వెళ్లనవసరం లేకుండా చీరాలలోనే సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందుబాటులోకి రావడం మంచివిషయమన్నారు. విజిటింగ్ డాక్టర్లు రావడం వలన ప్రజలకు కూడా ఇబ్బందులు తప్పుతాయన్నారు. అనంతరం గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ వెలినేని శ్రీకాంత్, కార్డియాలజిస్ట్ డాక్టర్ బండ్లమూడి శివాజి, యూరాలజిస్ట్ డాక్టర్ పెంట్యాల శ్రీకాంత్, జనరల్ మెడిసిన్ డాక్టర్ రేవూరి హరికృష్ణ వివిధ అంశాలపై అవగాహన సదస్సులో చర్చించారు. కార్యక్రమానికి 50 మంది ఐఎంఏ డాక్టర్లు కార్యక్రమానికి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment