నిరుపేదలకు అండగా ఫైట్‌మాస్టర్
చీరాల టౌన్: వ్యవసాయ కుటుంబంలో జన్మించా. పేద ప్రజల బాధలు కష్టాలు బాగా తెలుసు. సినీరంగంలో రాణించేందుకు ఎన్నో కష్టాలు పడ్డా. మంచి గుర్తింపు వచ్చిన తర్వాత తాను జన్మించిన ఊరికి, నియోజకవర్గంలో పేదలకు తనవంతుగా సహకారాన్ని అదించేందుకు కింగ్ సాల్మన్ ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నానని సినీ ఫైట్‌మాస్టర్ కింగ్ సాల్మన్ తెలిపారు. శనివారం మండలంలోని ఫైట్‌మాస్టర్ స్వగ్రామం తోటవారిపాలెంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 20 ఏళ్లుగా చేస్తున్న క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన తాను సినీరంగంలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతు పెద్ద హీరోలకు ఫైట్‌మాస్టర్లుగా పనిచేస్తున్నారన్నారు. తాను ఫైట్‌మాస్టరుగా పనిచేసిన సినిమాలు ఘన విజయాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. సినీ పరిశ్రమలో ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో నిరుపేదలకు బియ్యం, నూతన వస్త్రాలు బహూకరించడంతో పాటుగా అన్నీ విధాలుగా అండగా నిలిచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. ఆపదలో ఉన్నవారు, మంచంలో ఉన్నవారు, నిరాశ్రయులైన వారు, ప్రతిభ ఉండి ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకునే అభ్యర్థులకు తనవంతుగా సహకారాన్ని అందిస్తానన్నారు. సినీరంగంలో స్టంట్‌మాస్టర్ స్థాయికి ఎదిగానని, రెండుసార్లు జాతీయస్థాయి అవార్డులు అందుకున్నాన్నారు. అగ్రహీరోలైన ప్రభాస్ బాహుబలి, జూనియర్ ఎన్టీఆర్ దేవర, కల్కితో పాటు ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఎంబీసీ చిత్రానికి ఫైట్‌మాస్టర్‌గా పనిచేస్తున్నాన్నారు. సెమీక్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఇరవై వేలమంది ప్రజలకు విందును ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
20 ఏళ్లుగా క్రిస్మస్ సందర్భంగా సేవా కార్యక్రమాలు
స్వగ్రామానికి చేయూత కోసమే కింగ్ సాల్మన్ ఫౌండేషన్
సినీ ఫైట్ మాస్టర్ కింగ్ సాల్మన్
Comments
Please login to add a commentAdd a comment