12న కృష్ణానదిలో ఈత పోటీలు
తాడేపల్లి రూరల్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 12వ తేదీన కృష్ణానదిలో ఈత పోటీలు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. ఆదివారం అమరావతి కరకట్ట వెంబడి అసోసియేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కార్యదర్శి మండపాటి లక్ష్మీ నరసరాజు మాట్లాడుతూ.. విజయవాడ దుర్గా ఘాట్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వద్ద లోటస్ ఫుడ్ సిటీ వరకు రివర్ క్రాస్ స్విమ్మింగ్ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. వయస్సు పరంగా 11 –18, 19 – 30, 31 – 40, 51 – 60 ఏళ్ల వారికి విభాగాలవారీగా పోటీలు ఉంటాయని తెలిపారు. ప్రతి కేటగిరీలో మూడు బహుమతులు అందిస్తామని పేర్కొన్నారు. జనవరి 10వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. అనంతరం పోటీలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు వెలగపూడి వెంకటేశ్వరరావు, కన్వీనర్ దాసరి యుగేంధర్, కమిటీ మెంబర్లు కర్రి సాంబయ్య, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment