సత్ప్రవర్తనతో జీవితం బంగారుమయం
రేపల్లె రూరల్: సత్ప్రవర్తనతో జీవితం, భవిష్యత్ బంగారుమయంగా ఉంటుందని గుంటూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి. పార్థసారథి చెప్పారు. పట్టణంలోని సబ్‌జైల్‌లో మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రిమాండ్ ఖైదీలకు ఆదివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. క్షణికావేశంలో చేసిన తప్పులు జీవితాలతో పాటు కుటుంబ సభ్యుల పైనా ప్రభావం చూపుతాయని తెలిపారు. దీంతో జీవితకాలం బాధలు పడాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పారు. పగలు, ప్రతీకారాలు, రాగద్వేషాలను వీడి శాంతికాముకులుగా జీవించాలని సూచించారు. అనంతరం జైలులో ఖైదీలకు అందుతున్న వసతులు, మెడికల్ సదుపాయాలు, న్యాయ సహాయాలపై ఆయన ఆరా తీశారు. వివిధ రకాల చట్టాలను వివరించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ లీలావతి, రేపల్లె సబ్‌కోర్టు సీనియర్ సివిల్ జడ్జి టి.వెంకటేశ్వర్లు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బి.రూపశ్రీ , ప్యానల్ న్యాయవాది కె.వాణి, సబ్‌జైలు సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వర్లు, న్యాయవాదులు కె.శ్రీవాణి, కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment