కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటుతో నేరాల నియంత్రణ | - | Sakshi
Sakshi News home page

కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటుతో నేరాల నియంత్రణ

Published Mon, Dec 23 2024 2:04 AM | Last Updated on Mon, Dec 23 2024 2:03 AM

కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటుతో నేరాల నియంత్రణ

కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటుతో నేరాల నియంత్రణ

చీరాల/ కారంచేడు : కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేయడం వల్ల నేరాల్ని నియంత్రించవచ్చని సౌత్‌ కోస్టల్‌ రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు. ఆయన ఆదివారం చీరాల వన్‌టౌన్‌, కారంచేడు పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేశారు. ట్రాఫిక్‌ సమస్యలు, శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్‌ కేసులు త్వరితగతిన ఛేదన, ప్రజలు సైబర్‌ నేరాల బారిన పడకుండా అప్రమత్తం చేయడంపై పోలీసు అధికారులతో చర్చించి, పలు సూచనలు చేశారు. ప్రజలందరూ సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్‌ అరెస్టులపై జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. వాట్సప్‌ ద్వారా కస్టమ్స్‌, సీఐడీ, విజిలెన్స్‌ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులమని బెదిరింపులు వచ్చినప్పుడు మనోధైర్యం కోల్పోకుండా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని ఆయన సూచించారు. సైబర్‌ మోసం వల్ల డబ్బులు కోల్పోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్‌ చేసి వివరాలు అందించాలని తెలిపారు. పోలీసు అధికారులు కూడా సైబర్‌ నేరాల గురించి ప్రజలలో మరింత చైతన్యం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ తుషార్‌ డూడీ మాట్లాడుతూ నేర నియంత్రణ కోసం కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేయడం వలన మెరుగైన సేవలను ప్రజలకు అందించవచ్చని తెలిపారు. త్వరలోనే చీరాల వన్‌టౌన్‌, రూరల్‌, సముద్రతీర ప్రాంతాలలో విస్తృతంగా సీసీ కెమెరాలు, మైకులను ఏర్పాటు చేసి వాటిని కమాండ్‌కు అనుసంధానం చేసి పర్యవేక్షించనున్నట్లు వివరించారు. అనుమానాస్పద పరిస్థితులు ఉంటే మైక్‌ ద్వారా స్థానిక వీధుల్లో సిబ్బందిని, ప్రజలను అప్రమత్తం చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. త్వరలోనే కార్యాచరణకు ముందడుగులు వేస్తామని చెప్పారు. కార్యక్రమంలో చీరాల డీఎస్పీ మోయిన్‌, వన్‌టౌన్‌ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

సౌత్‌ కోస్టల్‌ రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement