90వ వసంతంలోకి సెయింట్ లూక్స్ చర్చి
సాల్మన్ సెంటర్లోని బేర్ కాంపౌండ్‌లో 1935లో నిర్మించిన సెయింట్ లూక్స్ చర్చి 90వ సంవత్సరంలోకి అడుగిడింది. ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ చర్చి మొదట్లో ఐదుగురు పెద్దలతో ప్రారంభమైంది. అప్పట్లో బేర్ దొరల సహాయ సహకారలతో ఎంతో సువిశాలమైన ప్రదేశంలో నిర్మాణం చేశారు. అనుబంధంగా విద్యార్థులకు చదువులు చెప్పేందుకు పాఠశాలలు, నర్సింగ్ కళాశాల, పేదలకు వైద్యం అందించేందుకు బేర్ ఆస్పత్రి నిర్మాణం కూడా చేపట్టారు. నాటి నుంచి చర్చిలో ప్రార్థనలతో పాటు ఆస్పత్రిలో వైద్య సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ చర్చి బీ క్లాస్ ప్యారిష్‌గా కొనసాగుతోంది. దేశాయిపేట, జాండ్రపేట, సిపాయిపేట, వేటపాలెం, చినగంజాంలలో నిర్మించిన చర్చీలు కూడా బేర్‌పేటలోని సెయింట లూక్స్ చర్చి కింద పనిచేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment