టీచర్లకు ‘వంట’ తంటా
బల్లికురవ: కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థను ఎలా నాశనం చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వ పాఠశాలలను గాలికొదిలేసి విద్యార్థులను ఇబ్బందులు పెడుతోంది. ఇందుకు నిదర్శనంగా మరో ఘటన నిలిచింది. మండలంలోని గురుకుల బాలికల విద్యాలయంలో వంట కార్మికులు లేకపోవడంతో ఉపాధ్యాయినులే వంట చేస్తున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. శుక్రవారం బల్లికురవలోని కస్తురిబా గాంధీ గురుకుల బాలికల విద్యాలయంలో ఎంఈవో–2 కే రమేష్‌బాబు మధ్యాహ్న భోజనం అమలు తీరును తనిఖీ చేశారు. అక్కడ ఉపాధ్యాయినులే భోజనం వడ్డించడం చూసి విస్తుపోయారు. వంట కార్మికులు 20 రోజులుగా విధులకు గైర్హాజరైన విషయంపై జిల్లా స్థాయి అధికారులకు నివేదిస్తానన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 244 మంది బాలికలు ఇక్కడ విద్య అభ్యసిస్తున్నారు. నలుగురు వంట కార్మికులు ఉండేవారు. ఇటీవల ఒకరు చనిపోగా, మరొకరు మెడికల్ లీవ్‌లో ఉన్నారు. మిగిలిన ఇద్దరూ గైర్హాజరు అయ్యారు. బాలికలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉపాధ్యాయినులే వంట వారి పాత్ర కూడా పోషిస్తూ వండి, వడ్డిస్తున్నారు. విషయాన్ని విద్యాలయ ప్రిన్సిపల్ కూడా గతంలో ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఫలితం మాత్రం ఇంతవరకు లేదు.
ఎంఈవో తనిఖీలో బహిర్గతం
Comments
Please login to add a commentAdd a comment