అద్దంకి రూరల్/మేదరమెట్ల: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. శుక్రవారం అద్దంకి, మేదరమెట్ల పోలీస్‌స్టేషన్‌లను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. వివిధ నేరాల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. క్రైం రికార్డులను పరిశీలించారు. పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పేర్కొన్నారు. కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్, అద్దంకి సీఐ పి. కృష్ణయ్య, మేదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment