‘అపుస్మా’ రాష్ట్ర అధ్యక్షుడిగా తులసీ విష్ణుప్రసాద్ ఎన్
కొల్లూరు: అపుస్మా నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా కొలసాని తులసీ విష్ణుప్రసాద్ ఎన్నికవడం పట్ల రాష్ట్ర ప్రైవేటు, అన్ ఎయిడ్‌డ్ పాఠశాలల యాజమాన్యాలు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశాయి. గుంటూరు జిల్లా వడ్లమూడి సమీపంలోని కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించిన అపుస్మా మాజీ అధ్యక్షుడు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అధ్యక్షతన (ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూల్ యాజమాన్యాల అసోసియేషన్) జరిగిన వార్షిక సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మండలంలోని చిలుమూరు శ్రీరామ రూరల్ విద్యాసంస్థల డైరెక్టర్ కొలసాని తులసీ విష్ణుప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పీవీ రమణారెడ్డి, అసోసియేట్ ఉపాధ్యక్షుడిగా జేఎస్పీ బాలాజీ, సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఎంవీ సుబ్బారెడ్డి, కోశాధికారిగా డాక్టర్ ఎం.కృష్ణలతోపాటు, మరో 16 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. సమావేశం ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, కేఎల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌లు డాక్టర్ జి.పార్ధసారధివర్మ, డాక్టర్ ఏవీఎస్.ప్రసాద్, డాక్టర్ ఎస్.వెంకట్‌రామ్, రిజిస్టార్ డాక్టర్ కె.సుబ్బారావు, అడ్మిషన్ డైరెక్టర్ జె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment