మధురం.. అలనాటి తీపిగుర్తులు
జే.పంగులూరు: మండలంలోని ముప్పవరం గ్రామంలో గల పాటిబండ్ల శ్రీమన్నారాయణ చౌదరి కమిటీ ఉన్నత పాఠశాలలో 1983–88 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం సోమవారం వైభవంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు కలుసుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. వారు వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 42 ఏళ్ల కిందట ఆ పాఠశాలలో వారు చేసిన అల్లరి పనులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థులందరూ వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను సత్కరించుకున్నారు. తమ ముందు ఆడుతూ, పాడుతూ కనిపించిన పిల్లలు, వారి కుటుంబలతో కలసి కార్యక్రమానికి రావడం చూసి ఉపాధ్యాయులు అమితానందం పొందారు. మా ఉపాధ్యాయులను సత్కరించుకోవడం మా పూర్తి జన్మ సుకృతం అని, వారివలనే మా జీవితాల్లో వెలుగు నిండాయని కొనియాడారు. పిల్లల ఆటపాటలతో కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు మారుతీ, రాజేంద్ర, వెంకారెడ్డి, శారద ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కృష్ణయ్య, ప్రధానోపాధ్యాయుడు పి ప్రసాద్, ఉపాధ్యాయులు జానకిరామయ్య, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
42 ఏళ్ల తర్వాత ఘనంగా
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
Comments
Please login to add a commentAdd a comment