గౌతమ బుద్ధుని ఆశయాలతోనే శాంతి సాధ్యం
భట్టిప్రోలు (కొల్లూరు): సమాజంలో శాంతి, సౌఖ్యాలు విరజిలాలంటే గౌతమ బుద్ధుని ఆశయాలు, సూక్తులు తప్పినిసరిగా ఆచరించాలని శ్రీలంక బౌద్ధ బిక్షువు బోధిహీన్ అన్నారు. సోమవారం భట్టిప్రోలు బౌద్ధ ఆరామాన్ని సందర్శించిన ఆయన పౌర్ణమి సందర్భంగా దీపోత్సవం నిర్వహించారు. తొలుత బౌద్ధ స్తూపం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. అనంతరం సుదర్శి మోహన్‌రావు అధ్యక్షతన జరిగిన సభలో బోధిహిన్ మాట్లాడారు. ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ ఎంఎస్‌ఎస్. అశోక్‌బాబు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ బుద్ధిజాన్ని స్వీకరించారని, ఆయన తరహాలోనే ప్రతి ఒక్కరూ బుద్ధిజాన్ని అలవరుచుకుంటే శాంతికాముకులవుతారన్నారు. సభ్యాక్షులు మోహనరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏప్రాంతంలో వారైనా బుద్ధుని ఆలయం నిర్మించాలనుకుంటే తమ సంస్థ సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు. బౌద్ధ స్థూపాన్ని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని పలువురు కోరారు. కార్యక్రమంలో తుపాకుల హరిప్రసాద్, ఏవీఎస్. రాజు, ఈగ శ్రీనివాసరావు, క్రాంతి, కసుకుర్తి హరిప్రసాద్, తిరుమలశెట్టి ప్రసన్నకుమార్, బౌద్ద ఉపవాసకులతోపాటు, బాసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు పాల్గొన్నారు.
శ్రీలంక బౌద్ధ బిక్షువు బోధిహిన్
Comments
Please login to add a commentAdd a comment