రైతుల ఫిర్యాదులు వేగంగా పరిష్కారానికి కృషి
ఏపీ సీఆర్డీయే అదనపు కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్,
తాడికొండ: రైతుల ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వేగవంతంగా పరిష్కారం చేయాలని ఏపీ సీఆర్డీయే అదనపు కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆదేశించారు. శుక్రవారంం తుళ్లూరు సీఆర్డీయే ప్రాంతీయ కార్యాలయంలో గ్రీవెన్స్ డేలో ఆయన రైతులు, రైతు కూలీల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం విధిగా నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేను రైతులు ఉపయోగించుకుని తమ సమస్యలు అధికారులకు తెలియజేస్తే సత్వర పరిష్కారం ఉంటుందన్నారు. గ్రీవెన్స్‌లో మొత్తం 38 ఫిర్యాదులు రాగా భూ వ్యవహారాలకు సంబంధించి 37, ప్రణాళికా విభాగానికి సంబంధించి ఒక ఫిర్యాదు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు కె.స్వర్ణమేరి, పి.పద్మావతి, జి.రవీందర్, ఏజీ చిన్నికృష్ణ, బి.సాయి శ్రీనివాస్ నాయక్, సామాజిక అభివృద్ధి విభాగం డీసీడీఓ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment