ఎన్టీఆర్ సేవలు అజరామరం
రేపల్లె రూరల్: సాధారణ ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి సినీ నటునిగా, రాష్ట్ర రాజకీయాలలో రాణించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎన్టీ రామారావు అందించిన సేవలు ఎనలేనివని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జానపద, పౌరాణిక చిత్రాలలో నటించి విమర్శకుల మన్ననలు పొందారన్నారు. పార్టీని స్థాపించిన అనతికాలంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలుగు భాష కీర్తిప్రతిష్ఠలను దశదిశల వ్యాప్తి చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని అన్నారు. అటువంటి నాయకుడిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పంతాని మురళీధరరావు, గూడపాటి శ్రీనివాసరావు, అనగాని శివప్రసాద్, జీవీ నాగేశ్వరరావు, దేవగిరి రవిశంకర్, కొమ్మూరి వెంకటేష్, మేకా వెంకట శివరామకృష్ణ, పంతాని సాయికుమార్, కొలసాని రాము, వెనిగళ్ల సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment