ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి
వైరా/బోనకల్: బ్యాంకుల్లో అప్పు ఉన్న ప్రతీ రైతుకు ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని సీపీఎం అనుబంధ తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైరా తహసీల్ ఎదుట మంగళవారం రైతులతో కలిసి ధర్నా చేయగా తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శుఽలు మాదినేని రమేష్, బొంతు రాంబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులందరి రుణాలు మాఫీ చేయాలన్నారు. జిల్లాలో ఇంకా లక్ష మంది రైతులకు మాఫీ కాకుండా వంద శాతం పూర్తయిందని ప్రభుత్వం ప్రకటించడం సరికాదన్నారు. అలాగే, రుణమాఫీ చేయాలని కోరుతూ రైతులు సీఎంకు రాసిన పోస్ట్‌కార్డులను బోనకల్ నుంచి పంపించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు వాసిరెడ్డి ప్రసాద్, మల్లెంపాటి రామారావు, చింతనిప్పు చలపతిరావు, మేడా శరాబందీ, కిలారు శ్రీనివాసరావు, బాణాల శ్రీనివాసరావు, సుంకర సుధాకర్, తోట నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, సాంబశివరావు, వెంకటేశ్వరరావు, మల్లికార్జున్, వాసిరెడ్డి నర్సింహారావు, తుళ్లూరి రమేష్, దొండపాటి నాగేశ్వరావు, గుమ్మా ముత్తారావు, కిలారు సురేష్ పాల్గొన్నారు. ఆతర్వాత రైతు సంఘం నాయకులు బోనకల్ మండలం తూటికుంట్లలో పర్యటించి కల్తీ విత్తనాలతో దెబ్బతిన్న మిర్చి పంటను పరిశీలించారు. అధికారులు స్పందించి రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment