రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతం చేయాలి
పాల్వంచ: లక్ష్మీదేవిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఈనెల 19 నుంచి 21 వరకు జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయాలని మల్టీజోనల్ అధికారి కె.అలివేలు, జోనల్ అధికారి కె.స్వరూపరాణి అన్నారు. బుధవారం స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలు నిర్వహిస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,400 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరవుతారని తెలిపారు. అనంతరం క్రీడల నిర్వహణ కమిటీలు వేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పీవీఎన్.పాపారావు, శ్రీలత, విజయ దుర్గ, పద్మావతి, నాగేశ్వరరావు, స్వరూప రాణి, మిథిల, సునీత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment