యాప్ సర్వే పారదర్శకంగా నిర్వహించాలి
బూర్గంపాడు: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం అధికారులు మొబైల్ యాప్ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి సూచించారు. మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో చేపట్టిన సర్వేను బుధవారం ఆమె పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఇంటిని పరిశీలించి మొబైల్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని నర్సరీని పరిశీలించారు. మొక్కలకు రోజూ నీరు పెడుతూ జాగ్రత్తగా కాపాడాలని సిబ్బందిని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించి చిన్నారులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment