విషవాయువుపై అవగాహన కల్పించండి
అశ్వాపురం: భారజలం ఉత్పత్తి ప్రక్రియలో విషవాయువు హైడ్రోజన్ సల్ఫైడ్ విడుదలైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీప గ్రామాల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మండల కేంద్రంలోని గౌతమీ నగర్ కాలనీలో గల పర్ణశాల అతిథి గృహంలో బుధవారం జీఎం హెచ్‌కే.శర్మ అధ్యక్షతన భారజల కర్మాగారం ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీ సబ్‌ప్లాన్ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీ చైర్మన్, కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా.. ప్రమాదవశాత్తూ విషవాయు వు విడుదలైతే భారజల కర్మాగారం రక్షణ పరిధిలోని గ్రామాల్లో యాజమాన్యం చేపడుతున్న చర్యలు, ముందు జాగ్రత్తగా చేపట్టే కార్యక్రమాల గురించి కర్మాగారం అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. యాజమాన్యం చేపడుతున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు, మీడియా సహకారంతో విస్తృత ప్రచారం నిర్వహించాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆ తర్వాత అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. సమావేశంలో భారజల కర్మాగారం డీజీఎం జి.శ్రీనివాసరావు, సీఏఓ వేణు, మెడికల్ సూపరింటెండెంట్ విజయ్‌కుమార్, సేఫ్టీ మేనేజర్ యోహాన్, రఫీక్ అహ్మద్, ఐఆర్‌ఓ లత, సీఐ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ స్వర్ణలత, ఎంపీడీఓ వరప్రసాద్, ప్రభుత్వ వైద్యాధికారి సంకీర్తన పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్
Comments
Please login to add a commentAdd a comment