చిరకాల స్వప్నం.. విమానాశ్రయం
చుంచుపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన విమానాశ్రయ నిర్మాణం ఏళ్లుగా ప్రతిపాదనల దశలో నిలిచి పోతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రంగాకిరణ్, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, నాయకులు తాండ్ర వినోద్‌రావు అన్నారు. మంగళవారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ మధ్యకాలంలో కొత్తగూడెం రామవరంలో విమానాశ్రయం కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను చేపట్టినట్లు తెలిసిందని, ఇది కూడా గతంలో మాదిరిగా పలు కారణాలు చూపెడుతూ ఆమోదం పొందకపోతే ప్రజలు మరోసారి నిరాశకు గురవుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన ప్రతిపాదనలు పంపితే కేంద్రం ఆమోదం పొందడానికి వీలుంటుందని చెప్పారు. గతంలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని విమానాశ్రయానికి ఏకై క స్థలమే కాకుండా మరికొన్ని చోట్ల అనువైన స్థలాలను గుర్తించి కేంద్ర విమానాయాన సంస్థకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశంలో జీవీకే మనోహర్, కుంజా ధర్మారావు, బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నరేంద్రబాబు, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, సోమసుందర్, కొదమసింహం పాండురంగాచార్యులు, సొప్పరి క్రాంతి, ముస్కు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం బీజేపీ నాయకుల బృందం కలెక్టర్ జితేశ్ వి.పాటిల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment