క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
బూర్గంపాడు: గ్రామీణ, పట్టణ ప్రాంతాల క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి అన్నారు. బూర్గంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహిస్తోందని తెలిపారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలకు తగు సమయం కేటాయించాలని సూచించారు. 29 విభాగాలలో ఈ క్రీడలు జరుగుతాయన్నారు. మండల స్థాయిలో గెలుపొందిన వారు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఎంపీడీఓ జమలారెడ్డి, ఎస్‌ఐ నాగబిక్షం కాసేపు ఆటలు ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరెడ్డి, ఎంఈఓ యదుసింహారాజు, అధ్యాపకుడు నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు బర్ల ప్రభాకర్, మహేష్, భూక్యా వెంకటేశ్, ప్రధానోపాధ్యాయురాలు రవీలా, విద్యాసాగర్, వేణుగోపాల్, హరికృష్ణ, వెంకటనారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment