పేద యువతికి సింగరేణి ఉద్యోగం | - | Sakshi
Sakshi News home page

పేద యువతికి సింగరేణి ఉద్యోగం

Published Thu, Dec 12 2024 9:47 AM | Last Updated on Thu, Dec 12 2024 9:47 AM

పేద య

పేద యువతికి సింగరేణి ఉద్యోగం

చండ్రుగొండ : మద్దుకూరు గ్రామంలోని పేదకుటుంబానికి యువతి కొంగర సాత్విక సింగరేణి సంస్థలో జూనియర్‌ మైనింగ్‌ ఇంజినీర్‌ ట్రైనీగా ఉద్యోగం సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఇటీవల నియామక పత్రాన్ని సాత్విక అందుకుంది. తండ్రి కొంగర కనకరాజు నాయీబ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ కుమార్తెను చదివించాడు. కాగా సాత్వికను గ్రామస్తులు అభినందించారు.

ఐదేళ్ల నిరీక్షణ ఫలించింది..

సివిల్స్‌ ఇంటర్వ్యూకు ఎంపికై న

సాయికుమార్‌

ఏన్కూరు: ఆ యువకుడు ఐదేళ్లుగా సివిల్స్‌ సాధించడమే లక్ష్యంగా అహోరాత్రులు శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యాన ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికవడం విశేషం. ఏన్కూరు మండలం అరికాయలపాడుకు చెందిన నల్లమల శ్రీనివాసరావు – అపర్ణ దంపతుల కుమారుడు సాయికుమార్‌ ఎస్సెస్సీ వరకు ఏన్కూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో, ఇంటర్‌ విజయవాడ చైతన్య కళాశాలలో, ఇంజనీరింగ్‌ ఓయూలో పూర్తిచేశాడు. వీరి కుటుంబానికి ఎకరం పొలం ఉండగా తండ్రి కిరాణం షాపు నిర్వహిస్తున్నాడు. దీంతో పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూనే ఐదేళ్లుగా సివిల్స్‌కు సిద్ధమవుతున్న ఆయన ఈసారి రెండు దశలు దాటి ఇంటర్వ్యూకు ఎంపికయ్యాడు. చిన్నప్పటి నుంచి సివిల్స్‌ లక్ష్యంగా ఎంచుకున్న సాయికుమార్‌ అడుగు దూరంలో ఉండగా విజయం సాధించాలని అరికాయలపాడు వాసులు ఆకాంక్షిస్తున్నారు.

బైక్‌ ఢీకొని

చిన్నారికి గాయాలు

ఇల్లెందు: ఇంటి ముందు ఆడుకుంటున్న 9 ఏళ్ల చిన్నారిని బుధవారం బైక్‌ ఢీకొనడంతో గాయాలయ్యాయి. పట్టణంలోని 14 నంబర్‌ బస్తీ 15వ వార్డుకు చెందిన గణేష్‌ లోథ్‌ కుమార్తె యామిని ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన విష్ణు లోథ్‌ బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో చిన్నారికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నాగుల్‌ మీరా ఖాన్‌ కేసు నమోదు చేశారు.

ముందస్తు అరెస్ట్‌

చలో హైదరాబాద్‌ కార్యక్రమం నేపథ్యంలో ఆరుగురు అంగన్‌వాడీ టీచర్లను బుధవారం ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు సీఐ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు.

రేషన్‌ బియ్యం స్వాధీనం

తల్లాడ: మండలంలోని పాత మిట్టపల్లిలో బుధవారం పది క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందని మీర్జా జిలాన్‌ బేగ్‌ ఇంట్లో 20 సంచుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకోగా, తల్లాడ పోలీసులు విచారణ చేపట్టారు.

చెరువుమాదారంలో...

నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాధారం గ్రామంలో ఓ ఇంట్లో నిల్వ ఉన్న పీడీఎస్‌ బియ్యాన్ని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దఎత్తున బియ్యం నిల్వలు ఉన్నాయనే సమాచారంతో తనిఖీ చేపట్టి స్వాధీనం చేసుకోగా, బియ్యాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే, ఎంత మేర బియ్యం పట్టుబడిందనే వివరాలను పోలీసులు వెల్లడించలేదు.

వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం

భద్రాచలంటౌన్‌: భద్రాచలం వద్ద బుధవారం గోదావరి నదిలో దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు యత్నించగా, బోట్‌ నిర్వాహకులు కాపాడారు. స్థానికుల కథనం ప్రకారం.. సరిహద్దు ఏపీ కూనవరం మండలానికి చెందిన విజయలక్ష్మికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిని సరిగా చూడకపోవడంతో జీవితంపై విరక్తితో భద్రాచలం వద్ద గోదావరి నదిలో దూకి చనిపోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో గోదావరిలో దిగే సమయంలో బోటు నిర్వహకుడు ప్రసాద్‌ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధరాలిని స్టేషన్‌కు తరలించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

బేకరీలో అగ్నిప్రమాదం

ఖమ్మంక్రైం: ఖమ్మం కస్బాబజార్‌లోని ఓ ప్రముఖ బేకరీలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. వంటగది చిమ్నీ నుంచి ఆకస్మాత్తుగా మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌ఎఫ్‌ఓ నాగరాజు ఆధ్వర్యాన చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా, బేకరీ చుట్టుపక్కల అన్నీ వ్యాపార దుకాణాలే ఉండటంతో తీవ్ర ఆందోళన నెలకొనగా.. మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పేద యువతికి  సింగరేణి ఉద్యోగం1
1/2

పేద యువతికి సింగరేణి ఉద్యోగం

పేద యువతికి  సింగరేణి ఉద్యోగం2
2/2

పేద యువతికి సింగరేణి ఉద్యోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement