గణిత పరీక్షలో విద్యార్థుల ప్రతిభ
కొత్తగూడెంఅర్బన్: పాతకొత్తగూడెంలో పాఠశాలలో బుధవారం గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి మండలం నుంచి ఆంగ్ల, తెలుగు మీడియాల నుంచి 136 మంది విద్యార్థులను ఎంపిక చేసి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీఈఓ వెంకటేశ్వరాచారి మాట్లాడుతూ పరీక్షలు విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెరిగి భయం తొలగించేందుకు పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం విజేతలకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఏసీజీఈ మాధవరావు, ఎంఈఓ ప్రభుదయాళ్, టీఎంఎఫ్ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్, ఏఎంఓ నాగరాజశేఖర్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ సతీష్ కుమార్, పాఠశాల హెచ్‌ఎం లక్ష్మి, టీఎంఎఫ్ రాష్ట్ర బాధ్యులు హరి, సీహెచ్ మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment